ఆబ్కారీ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

ఆబ్కారీ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కమిషనర్ సి.హరికిరణ్ ఎగరవేసారు. ఆబ్కారీ భవన్‌లో మంగళవారం తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ ఆబ్కారీ భవన్ ఆవరణలో జాతీయ జెండాను అవిష్కరించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ గీతం, తెలంగాణ గీతం అలాపన చేశారు. మరోమారు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ వెంట అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్లు అనిల్ కుమార్‌రెడ్డి, దశరథ్, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర బాబుతోపాటు డీఎస్పీలు, అసిస్టెంట్ మేనేజర్ టీజీబీసీఎల్ విజయలక్ష్మీ, ఏఎస్ సర్వీసెస్ నాగలక్ష్మి తో పాటు ఎక్సైజ్ సూపరిటెండ్‌లు, ఏఈఎస్‌లు, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

