Chevella | అదనపు బస్సులు కేటాయించాలి

Chevella | అదనపు బస్సులు కేటాయించాలి

ఎమ్మెల్యే, ఆర్టీసీ డిపో మేనేజర్ కు మాజీ వైస్ ఎంపిపి కె. శివప్రసాద్ వినతి


Chevella | చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల (Chevella) మున్సిపల్‌ పరిధిలోని ఊరెళ్ల విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు ముగిసే సమయానికి చేవెళ్ల నుండి తిరుగు ప్రయాణానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి అదను బస్సులు కేటాయించాలని మాజీ ఎంపీపీ కర్నె శివ ప్రసాద్ (Karne Siva Prasad) పేర్కొన్నారు. గురువారం మాజీ వైస్‌ ఎంపీపీ కర్నే శివప్రసాద్‌ ఊరెళ్ల గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, వికారాబాద్‌ డిపో మేనేజర్‌కు వినతి పత్రం తెలియజేశారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను వివరించగా.. చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య (Chevella MLA Kale Yadayya), ఆర్టీసీ అధికారులు స్పందించి సాయంత్రం రద్దీ సమయంలో అదనపు బస్సు సర్వీసులు అందించే దిశగా చర్యలు త్వరలోనే తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విఠయ్య, గాంధీ, రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply