మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
సూర్యాపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మలేషియాలో ఘనంగా జరిగాయి. కౌలాలంపూర్ నగరంలోని ఎంఈసీసీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, మైటా సభ్యులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకుంటూ మలేషియాలోని తెలంగాణ ప్రజలతో కలిసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ నాయకుడు సురకంటి శ్రీనివాస్, మైటా అధ్యక్షుడు ఎస్. తిరుపతి, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి పాల్గొన్నారు.
అలాగే రాష్ట్ర నాయకులు ఉపేందర్ గౌడ్, పడాల సతీష్, మైటా, బీఆర్ఎస్ సభ్యులు మన్సూర్, సంతోష్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు.
