వీదికుక్కల దాడి…

వీదికుక్కల దాడి…
నలుగురికి తీవ్ర గాయాలు..
రెండు ఆవులపై దాడి..

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లిలో వీదికుక్కలు దాడి చేసి నలుగురు మనుషులను, రెండు ఆవులను తీవ్ర గాయాలకు గురిచేశాయి. గ్రామానికి చెందిన బుర్రగడ్డ పుష్పలత, మెట్ పల్లి గంగాజల, గట్టు రాజన్న, గట్టు శ్రీరామ్ లపై వీదికుక్కలు దాడి చేయగా, వారందరికి చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రెండు ఆవులపై ఆ కుక్కలు దాడి చేయగా, ఆవుల కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
వారందరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆవులకు చికిత్స చేయించారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం స్థానిక సర్పంచి పంజాల సురేష్ గౌడ్ మాట్లాడుతూ… వీదికుక్కల వల్ల ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలోని నలుగురు మనుషులపై, రెండు ఆవులపై వీదికుక్కలు దాడి చేసి తీవ్రగాయాలకు గురిచేశాయని ఆయన చెప్పారు.
వారందరూ ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి వీదికుక్కలపై చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన కోరారు.
