నేరాల నియంత్రణ కోసం..

నేరాల నియంత్రణ కోసం..

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ ఒకటొవ వార్డు అల్లూరి సీతారామరాజు నగర్ లో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వ హించారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలను, స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు. కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానస్పదంగా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సైబర్‌ నేరాల పట్ల అప్ర మత్తంగా ఉండాలని, సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సైలు రాజశేఖర్, రాజశేఖర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply