పర్యావరణ సమస్యలపై ప్రజల్లో అవగాహన..
వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమ సమావేశం
మహబూబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : శుక్రవారం పట్టణంలోని పత్తిపాక రోడ్డులోని ఐ ఎం ఎ కమిటీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ . బి.రవిరాథోడ్ అధ్యక్షతన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, జనాభా పెరుగుదల వల్ల ఏర్పడే సామాజిక, ఆర్థిక, ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యంఅని తెలియజేస్తూ కుటుంబ నియంత్రణ, మాతా-శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, యువత ఆరోగ్యం మరియు విద్యపై అవగాహన పెంపొందించడం దీని లక్ష్యం అని అన్నారు.
“ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనం గడపడానికి కుటుంబ సంక్షేమ సేవలను వినియోగించుకోవాలని, చిన్న కుటుంబం – సుఖీభవ కుటుంబం అనే భావనను ప్రోత్సహించాలనే లక్ష్యం తో “చిన్న కుటుంబం – సంతోషకరమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన భారతం.”*అనే నినాదం తో జిల్లాలో కుటుంబ నియంత్రణ పద్ధతులపై తాత్కాలిక పద్ధతుల్లో స్త్రీలకు ఐయుసి డి, అంతర ఇంజక్షన్, ఓరల్ పిల్స్ మాత్రలు మరియు మగవారికి నిరోద్ వాడాలని వివరిస్తూ బిడ్డకు బిడ్డకు మధ్యన గర్భధారణ కనీసము (3 సంవత్సరాల పాటు ) పాటించాలని అర్హులైన దంపతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి ఓ ఎమ్ హెచ్ ఎన్ డాక్టర్ విరాజిత, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శివకుమార్, వైద్య అధికారిని, డిప్యూటీ డెమో రాజకుమార్, హెచ్ఈఓ లోకీయా మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
