Flag march | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Flag march | రాయపోల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి లోటు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు శాఖ(Police Department) ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. తొగుట సీఐ లతీఫ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు రాయపోల్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల(Main streets)తో పాటు వడ్డేపల్లి, రాంసాగర్ గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ ను నిర్వహించారు.
ఈసందర్భంగా సిఐ లతీఫ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో చట్ట – సమాధాన పరిస్థితులపై ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు, గ్రామాల్లోనూ ప్రత్యేక పహారా(Special food) చేపడతామని సీఐ తెలిపారు. ఎవరైనా ఆచరణలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి(Violating)నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు(To threats) లొంగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయపోలు ఎస్సై మానస క్యూ ఆర్టి టీమ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
