Eluru | అనుమతులు ఉంటేనే ఆసుపత్రిలోకి అడుగు
- ఎంసీహెచ్ బ్లాక్‌పై ఆంక్షలు
- ఆసుప్రతిలోఅకతవకలపై మీడియా దుష్ప్రచారం చేస్తుందంటే ఆరోపణలు
- కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు, అక్షంతలు
- మరింత ఇబ్బందులకు గురవుతున్న రోగులు
ఏలూరు, ఆంధ్రప్రభ: గతం ఎంతో ఘనం, వర్తమానం సమస్యల వలయం, భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిన ఏలూరు సర్వజన ఆసుపత్రి పనితీరు. ఏలూరు సర్వజన ఆసుపత్రి జిల్లా ఆసుప్రతికిగా ఉన్నప్పుడు రోగులకు ఎన్నో సేవలందించింది. మరీ ముఖ్యంగా తల్లి పిల్లల విభాగం (ఎంసీహెచ్ బ్లాక్ ) సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్థానికంగానే కాకుండా స్థానికేతరులు సైతం, అలాగే ఆర్థికంగా ఉన్నవారు సైతం ఏలూరు జిల్లా ఆసుపత్రిలో చేరి ప్రసవాలు చేసుకునేవారు.
కానీ అలాంటి ఆసుపత్రి ఇప్పుడు జిల్లా ఆస్పత్రి నుంచి సర్వజన ఆసుపత్రిగా స్థాయి పెరిగినా అందించే సేవలలో మాత్రం నేల చూపులు చూస్తోంది. 2023లో ఏలూరు జిల్లా ఆసుపత్రిని బోధనా ఆసుపత్రిగా (మెడికల్ కాలేజీ) మార్పు చేశారు. అప్పటి నుంచి అంపశయ్యపై ఆసుపత్రి అన్నట్టుగా ఉంది. సరోజన ఆసుపత్రి పనితీరు ఇలా అవ్వడానికి కారణం సీనియర్ డాక్టర్లను బదిలీ చేసి జూనియర్ డాక్టర్లకు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా సరోజన ఆసుపత్రి పనితీరు పడిపోయింది. దీనికి తోడు సమస్యలను ఎత్తిచూపుతున్నపుడు వాటిని సరి చేసుకోవాల్సింది పోయి, అటు రాజకీయ నాయకులకు, ఇటు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చే మీడియాపై ప్రస్తుతం ఆంక్షలు విధించి సర్వజన ఆస్పత్రి సూపరిండెంట్ కొత్త పర్వానికి తెర లేపారు.
అనుమతులు తప్పనిసరి..
మీడియాకు ఎంసీహెచ్ బ్లాక్ లో ప్రవేశ లేదని.. ఏ కారణం చేతనైనా ఎంసీహెచ్ బ్లాక్ లో మీడియా ప్రతినిధులు ప్రవేశించాలంటే తన అనుమతులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేస్తూ, సంబంధిత కిందిస్థాయి సిబ్బందికి అక్షింతలు కూడా వేసి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. వాస్తవానికి ఈ అధికార దర్పం చేసే పనిపై శ్రద్ధ చూపిస్తే సమస్యలు ఉండవంటూ రోగులు సైతం ఈ సమస్యలే ఉండమంటూ హితవు పలుకుతున్నారు.
ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనలు సర్వజన ఆసుపత్రి పని తీరుపై పలు ఆరోపణలు రావడంతో, ఆసుపత్రి సిబ్బందికి, డాక్టర్లకు స్థానిక ఎమ్మెల్యే సైతం అక్షింతలు వేసిన సందర్భాలు అనేకం. అయినప్పటికీ తీరు మార్చుకోకపోగా సమస్యలను ఎత్తు చూపే మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగుల సహాయకులతో పాటు సీపీఐ ఎం వంటి వామపక్ష పార్టీలు కూడా వేలెత్తి చూపుతున్నారు. కానీ సర్వజన ఆసుపత్రి పనితీరులు మార్పు రావడం లేదు.
కనీస వసతలులు లేక ఇబ్బందులు..
ఆసుప్రతిలో చేరిన గర్భిణులు ప్రసవం అయిన తర్వాత కుట్లు ఇన్ఫెక్షన్ అయ్యి నెలల తరబడి అసుప్రతిలో ఉండటం నుంచి శిశు మరణాలు, వంటి సంఘటనలు ఆసుప్రతి పనితీరును ప్రశ్నార్ధకంగా మార్చాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు. రోగుల సహాయకులుగా ఉన్న వారికి కనీసం తాగునీరు సైతం అందకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడం, రోగులను విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేయడం వంటి అనేక సమస్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు, ఇంచార్జ్ మంత్రి, ఎంపీ, ఎంఎల్ఎలు అనేక పర్యాయాలు ఆకస్మిక తనిఖీలు చేసిన సిబ్బంది పనితీరులో మాత్రం ఏ విధమైన మార్పు రాకుండా నానాటికి నేల చూపులు చూస్తున్నది అనడంలో అతిశయోక్తి లేదు.
