పంట పొలాల వ్యర్ధాల కాల్చివేత..

పంట పొలాల వ్యర్ధాల కాల్చివేత..
- చెలరేగిన మంటలు
- రాంనగర్ ,బీసీ కాలనీ తప్పిన ప్రమాదం
- ఫైర్ ఇంజన్, పంచాయతీ వాటర్ ట్యాంకులతో అదుపులోకి మంటలు
చిట్యాల, ఆంధ్రప్రభ : మండుతున్న ఎండల్లో రైతులు తమ పంట పొలాల్లోని వరి, మొక్కజొన్న పంటల వ్యర్ధాలను కాలబెడుతున్నారు. దీంతో మంటలు చెలరేగి వివిధ ప్రాంతాలకు గాలివీచడంతో వ్యాపించి భారీ నష్టం, ప్రాణ వాటిల్లుతుంది. ఆదివారం మండల కేంద్రంలోని రాంనగర్, బీసీ కాలనీ సమీపంలో పంట పొలాలకు రైతులను నిప్పు పెట్టడంతో, ఉష్ణోగ్రత పెరిగి గాలి ఎక్కువగా వీచడంతో మంటలు చెలరేగి, గ్రామాల్లో మంటలు రావడంతో ప్రజలు ఆందోళనతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానిక సర్పంచి గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ తో పాటు ఏలేటి రామయ్య పల్లి, గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ లతోపాటు భూపాలపల్లి, ఫైర్ ఇంజన్, సిబ్బందితో పాటు ప్రజలు, మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో రైతులు బోల్లపల్లి సాంబయ్య, ఆరెపల్లి సమ్మయ్య, కట్కూరి సమయ తదితర రైతుల వడ్లు, పైపులు, వరిగడ్డి ,దగ్ధమైనట్లు తెలిపారు.
