రౌడీ షీటర్స్ కి సీఐ కౌన్సిలింగ్..
రౌడీ షీటర్స్ కి సీఐ కౌన్సిలింగ్..
నర్సాపురం, ఆంధ్రప్రభ : మంచిగా ఉంటే మీ జోలికి రానని, తేడా వస్తే మాత్రం ఊరుకునేది లేదని రౌడీ షీటర్స్ కు పట్టణ సీఐ ఆకుల రఘు హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ కు సోమవారం ఉదయం ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. గతాన్ని మర్చిపోండి. మంచిగా జీవించండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కష్టపడి పని చేసుకొని మంచిగా జీవించాలని సూచించారు. మంచిగా మారితేనే.. మీ జీవితానికి మంచి మార్గం దొరుకుతుందని సూచించారు. దొంగతనాలు చేసినా, గంజాయి విక్రయాలు జరిపినా జైలుకు పంపడమే గాకుండా రౌడీ షీటర్స్ గానే ఉండిపోతారన్నారు.
అలాకాదు… ఇలానే ఉంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంఘ విద్రోహ శక్తులుగా తయారైతే ఉక్కుపాదం మోపుతామని తేల్చి చెప్పారు. మీరు సత్ప్రవర్తన కలిగి సమాజం లో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. మీలో మార్పు వచ్చి మంచిగా మారితే రౌడీ షీట్ నుంచి మీ పేర్లు తొలగిస్తామని తెలిపారు. కౌన్సెలింగ్ లో పట్టణ ఎస్ ఐ లు ప్రేమరాజ్, ముత్యాలరావులు ఉన్నారు.
