RIP | పాక్ కాల్పుల్లో అమ‌రుడైన మ‌హారాష్ట్ర జ‌వాన్

క‌శ్మీర్ లోని రాజోరిలో పాక్ విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పులు
నేడు ఒక్క రోజు అయిదురు మ‌ర‌ణం
మ‌ర‌ణించిన వారిలో ఒక జ‌వాన్ , అద‌న‌పు డిప్యూటీ క‌మిష‌న‌ర్
రేపు ముర‌ళీనాయ‌క్ కు అంత్య‌క్రియ‌లు
హాజ‌రుకానున్న ప‌వ‌న్, లోకేష్

శ్రీన‌గ‌ర్ – భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నక్రమంలో పాకిస్థాన్ సైన్యం జరిగిన కాల్పుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. ఇప్పుడు మరో యువ జవాన్‌ కూడా వీరమరణం పొందారు. జమ్మూలోని రాజోరిలో జ‌రిగిన పాక్ కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) నేడు వీరమరణం పొందారు. సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహం తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ముగ్గురు సాధారణ పౌరులు కూడా చనిపోయారు.. దీంతో నేడు ఒక్క రోజే జమ్ములోని రాజోరిలో జరిగిన కాల్పులలో అయిదుగురు ప్రాణాలు కోల్పోగా , వారిలో అదనపు డిప్యూటీ కమిషనర్ కూడా ఉన్నారు..

Leave a Reply