27thMay 2026 | తిరుమల సమాచారం..

27thMay 2026 | తిరుమల సమాచారం..
27thMay 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :
ఓం నమో వెంకటేశాయ..
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (26-05-2026) శ్రీవారిని మొత్తం 89,403 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44,234 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లకు చేరింది. అదే రోజు 4.14 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.55 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించారు.
అలాగే 3,631 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సర్వదర్శనం కోసం సిలాతోరణం వెలుపల వరకు వేచి ఉండే క్యూలైన్లు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
