Festivals | క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి

Festivals | క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి
- జనసేన పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు
Festivals | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం సత్యనారాయణపురంలోని నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల(Christmas celebrations)ను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా దైవ సేవకులు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్(Booragadda Srikanth) క్రిస్మస్ కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు.
ఈ సందర్భంగా విశ్వాసులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు దేవుడు చూపిన మార్గాలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరిపై దేవ దేవుని కరుణాకటాక్షాలు ఉండాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, మండల అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, పార్టీ నాయకులు వేమూరి త్రినాథ్, సుంకర వెంకట్, గుండు వెంకట్రావు, మీరా షరీఫ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
