accident | చిత్తూరులో ఘోర ప్రమాదం

మహిళ మృతి, యువకుడికి గాయాలు

accident | చిత్తూరులో ఘోర ప్రమాదంగంగాధర నెల్లూరు, ఆంధ్రప్రభ : చిత్తూరులోని పుత్తూరు రోడ్డు పైన, హెరిటేజ్ సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తానా వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఇనోవా వాహనం అత్యధిక వేగంతో ప్రయాణిస్తూ, వన్-వే రోడ్డు పైన ఉన్న డివైడర్‌ను దాటి, ఎదురు వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుండ్లూరు నివాసి మీరమ్మ (50) అక్కడికక్కడే మృతి చెంద‌గా.. రఘు నాయుడు గాయపడ్డాడు. ర‌ఘునాయుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. గంగాధర నెల్లూరు పోలీసులు ప్ర‌మాద స్థలానికి చేరుకుని విచారణ చేప‌ట్టారు. ప్రమాదానికి కారణమైన ఇనోవా వాహన డ్రైవర్‌ను గుర్తించడానికి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Leave a Reply