Loksabha| డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక – వెంట‌నే ప్రారంభించాలని కోరుతూ ప్ర‌ధానికి ఖ‌ర్గే లేఖ

న్యూఢిల్లీ: లోక్‌స‌భ‌కు డిప్యూటీ స్పీక‌ర్‌ను (Deputy Speaker) ఎన్నుకోవాల‌ని, ఆ ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇవాళ ప్ర‌ధాని మోదీకి (PM Modi) లేఖ రాశారు. ఎటువంటి జాప్యం చేయ‌కుండా ఆ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌న్నారు. 16వ లోక్‌స‌భ (Loksabha) ప్రారంభం అయ్యే వ‌ర‌కు ప్ర‌తి స‌భ‌లోనూ డిప్యూటీ స్పీక‌ర్ ఉన్నార‌ని, ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవ‌డం ఆన‌వాయితీ అని ఆయ‌న ఆ లేఖ‌లో తెలిపారు. కానీ తొలిసారి ఆ పోస్టు రెండు ప‌ర్యాయాల నుంచి ఖాళీగా ఉంటోంద‌ని ఖ‌ర్గే గుర్తు చేశారు. ఇది భార‌తీయ ప్ర‌జాస్వామ్యానికి శుభ‌సంకేతం కాదు అని, రాజ్యాంగంలోని హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని ఖ‌ర్గే పేర్కొన్నారు.

Leave a Reply