అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని చిలాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గొంటి బాలయ్య (48) తన వ్యవసాయ క్షేత్రం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వ్యవసాయంలో నష్టాలు, అప్పుల భారం కారణంగా మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.