Farmer | త్వరలో కరీంనగర్‌లో…

Farmer | త్వరలో కరీంనగర్‌లో…
- మంత్రి తుమ్మల
Farmer | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. లాభాలు వచ్చే వ్యవసాయమే రైతులు చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ తో రైతులకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. తాను 40ఏళ్లుగా ఆయిల్ ఫామ్ సాగుచేస్తున్నానన్నారు. మీరు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చన్నారు. త్వరలోనే కరీంనగర్ లో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు.
