కేంద్ర మంత్రి బండిని వెంటనే రాజీనామా చేయాలి…

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ ; కేంద్ర సహాయక హోం శాఖ మంత్రి బండి సంజయ్ ని వెంటనే భర్తరఫ్ చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ నాయకులతో కలసి రహదారిపై రాస్తారోకో,ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ కి సహకరిస్తున్న తన తండ్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని A2 గా చేర్చాలని, ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు, లేని పక్షంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు, ఈ కేసుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని A3 గా చేర్చాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
