ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్‌లు తగులుతున్న సంగతి తెలిసిందే. అయితే వరుసగా ఆప్ అగ్రనేతలు అంతా వరుస ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు ఓటమి పాలయ్యారు. ఇలాంటి తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్త ఊరట నిచ్చేలా సీఎం అతిశీ గెలుపొందారు.
కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరిని ఓడించారు. అతిశీ..రమేశ్ బిధూరిల మధ్య మెుదటి నుంచి ఉత్కంఠ పోరు నడిచింది. చివరి రెండ రౌంట్లలో స్వల్ప ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు.