DRO | రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి

DRO | రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి
- డీఆర్ఓ వెంకటనారాయణమ్మ
కర్నూలు, ఆంద్రప్రభ : రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి అనుసరించాలని డీఆర్ఓ వెంకటనారాయణమ్మ (DRO Venkata Narayanamma) అన్నారు. బుధవారం ఉదయం డీఆర్ఓ ఛాంబర్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 వ జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2015లో నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారని .. బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత మన దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (B.R. Ambedkar) మరి కొంతమంది సహాయకులతో రాజ్యాంగాన్ని తయారుచేసి ఏర్పాటు చేశానన్నారు.
అందులో ప్రతి పౌరునికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారని ఈ హక్కులను కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని గౌరవించడం మన అందరి బాధ్యత అని సూచించారు. ఇప్పుడు మనం పొందుతున్న స్వేచ్ఛ , ప్రతి సౌకర్యము , హక్కులు మనకు రాజ్యాంగం ద్వారా కల్పించబడినదే అని డిఆర్ఓ తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగమును (Constitution) గౌరవిస్తూ, అనుసరిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడుతామని డీఆర్ఓ అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ రాజ్యాంగ దినోత్సవ సమావేశానికి కలెక్టరేట్.సెక్షన్. సూపర్డెంట్ లు వెంకటేశ్వర్లు , ప్రకాష్ బాబు, ఇంద్రాణి తోపాటు డిప్యూటీ తాసిల్దారులు , సీనియర్ అసిస్టెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.
