ఓటర్ల సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పరి కుమార్
కొత్తగూడ, ఆంధ్రప్రభ: ఓటర్ల సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఎన్నికల అధికారులకు సహకరించాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చొప్పరి కుమార్ కోరారు. మంగళవారం గ్రామంలో ఓటర్ల సర్వే ఫారాల నమోదును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఓటర్ల సర్వే ఫారాలను పూర్తి వివరాలతో నింపి సంబంధిత అధికారులకు అందించాలని సూచించారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్న ఆయన, గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఫారాలు నింపిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
