ఉరి వేసుకుని మహిళ మృతి
కోయిలకొండ, ఆంధ్రప్రభ: మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనురాధ (25) అనే మహిళ ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
మృతురాలి తండ్రి మద్దూరు అనంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుమార్తె అనురాధను భర్త కృష్ణయ్య, ఆడబిడ్డ రాములమ్మ, ఆడబిడ్డ భర్త అంజలయ్య అదనపు కట్నం కోసం వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగానే అనురాధ తన గదిలోని పైపుకు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తండ్రి ఆరోపించారు.
ఘటనపై డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మృతురాలికి తొమ్మిది నెలల బాబు ఉన్నాడు.
