సర్ ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయండి

మరిపెడ, ఆంధ్రప్రభ: సర్ ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న సర్ ఆన్లైన్ నమోదు ప్రక్రియను జడ్పీ సీఈఓ పురుషోత్తం ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మార్వో కృష్ణవేణి, ఎంపీఓ సోమ్లాల్ తో కలిసి పరిశీలించారు. ఎన్యుమరేషన్ పత్రాల ఆన్లైన్ నమోదు తీరును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటైజేషన్ నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని బీఎల్ఓ లకు సూచించారు.

అనంతరం మండలంలోని అబ్బాయిపాలెం (మదిరిపురం) మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ)ను ఏపీ సీఈఓ పురుషోత్తం పరిశీలించారు. ఏసీ ఎల్‌బీ (ఐ/సీ), గ్రిడ్ డీవైఈఈతో కలిసి ప్లాంట్‌ను సందర్శించిన ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, విధి నిర్వహణ పరిస్థితులు, ఇతర అంశాలపై ఆరా తీశారు. ప్లాంట్‌లోని పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి భగీరథ అధికారులు తదితరులు ఉన్నారు.