మల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

కన్నాయిగూడెం యువకుడికి తీవ్ర గాయాలు

కన్నాయిగూడెం, మంగపేట, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన యువకుడు కోరం సునీల్ మంగపేట మండలం మల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సునీల్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన ఒక కాలు తీవ్రంగా దెబ్బతిని విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన సునీల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సునీల్ తల్లి పేరు బక్కకగా తెలిసింది. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు, ఏ వాహనం ఢీకొట్టింది, ప్రస్తుతం సునీల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.