దళితరత్న అవార్డు గ్రహీతకు ఎంపీ సన్మానం

దళితరత్న అవార్డు గ్రహీతకు ఎంపీ సన్మానం

కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మహనీయుల ఉత్సవాల సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో కల్వకుర్తికి చెందిన మాల మహానాడు నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు రావుల శ్రీనివాసులుకు దళిత రత్న అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లు రావుల శ్రీనివాసులకు శాలువాతో సన్మానించి అభినందించారు. దళిత ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. దళిత రత్న అవార్డు రావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని శ్రీనివాసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రత్నమాల, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ , మాజీ ఎంపిటిసి రాం పర్వతాలు, మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు, నాయకులు రావుల చెన్నకేశవులు, గోరటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply