ఘనంగా మాజీ చైర్మన్ జన్మదిన వేడుకలు..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మాజీ తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ తిరుమల రాకేష్ జన్మదిన వేడుకలను పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ బిక్షపతి, ఉప సర్పంచ్ మేకల కుమార్, ఆవుల సంతోష్, కంచి నాగరాజ్, సాయి లక్ష్మణ్, సుమన్, పెంచాల శ్రీకాంత్, ముత్యం లక్ష్మణ్, పీర్ల రమేష్, ఠాగూర్ చంద్ సింగ్, పుట్ట గట్టయ్య, కన్నె శివ, ఓం ప్రకాష్, కిషన్, ఫణీందర్, అల్లం మహేందర్, పిట్ట రవీందర్, మల్లేశం, అశోక్, కంచె మధుకర్, ఉనుకొండ ప్రకాష్, అజయ్, వడ్నాల శంకర్, కొమరయ్య, తూముల శ్రీనివాస్, ఉనుకొండ మధుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల రాకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.