Sensational Twit | స్మితా సబర్వాల్‌ మరో సంచలన ట్వీట్

హైదరాబాద్‌: తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్‌ చేశారు . ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసిన అనంత‌రం ఎక్స్ వేదికగా సీనియ‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ స్పందించారు. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్‌ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను అని ట్వీట్‌ చేశారు.

నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది అంటూ స్మితా ట్వీట్‌ చేశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్‌.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.

Leave a Reply