ఛత్తీస్ గడ్ అడవులు మరోసారి ఎదురుకాల్పులతో దద్దరిల్లుతోంది. సరిహద్దు జిల్లా బీజాపుర్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబి అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపడుతోన్న తరుణంలో ఈ కాల్పులు మొదలయ్యాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణ వైపు నుంచి కూడా పారామిలటరీ బలగాలు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా నక్సల్స్ ఎదురుపడటంతో కాల్పులు ప్రారంభించారు.. దీంతో చత్తీస్ గడ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించేందుకు యత్నించిన నక్సల్స్ భద్రతా కాల్పులతో వారంతా కర్రెగుట్ట వైపు పరుగులు తీశారు.. ఇక అటు చత్తీస్ గడ్ నుంచి , ఇటు తెలంగాణ సరిహద్దుల నుంచి భారీ భద్రతాబలగాలు కర్రెగుట్ట వైపు దూసుకువెళుతున్నాయి.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Encounter | చత్తీస్ గడ్ – తెలంగాణ సరిహద్దులలో కాల్పులు – కర్రెగుట్ట వైపు పారిపోతున్న నక్స లైట్లు
