Emotional post | ఎన్టీఆర్‌ను స్మరించుకున్న మెగాస్టార్ చిరంజీవి

Emotional post | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ఖాతాలో ఆయనను స్మరించుకుంటూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. , “ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు” అని పేర్కొన్నారు.

ఆయన వ్యక్తిత్వాన్ని, నటనను కొనియాడుతూ, “తెరపై ఎన్నో పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా, ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఆయన అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు” అని కొనియాడారు.
అంతేకాకుండా, తనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించడం ఎంతో గౌరవప్రదమైన విషయమని చిరంజీవి తన పోస్ట్‌లో గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా పెద్దాయనతో చిరంజీవి కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు సైతం నందమూరి తారక రామారావుకి నివాళి అర్పిస్తూ కామెంట్స్ చేశారు.
