gold rates may 28| భారీగా ప‌త‌న‌మైన గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్లు

gold rates may 28| భారీగా ప‌త‌న‌మైన గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : బంగారం, వెండి ధర‌లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మే 28, 2026న గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు, గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన భారీ అమ్మకాల ప్రభావం భారత మార్కెట్‌పైనా కనిపించింది. అమెరికా డాలర్ బలపడటం, డాలర్ విలువ పెరిగితే బంగారం కొనుగోలు ఖరీదవుతుంది. దీంతో డిమాండ్ తగ్గుతుంది. ఆయిల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు వచ్చాయి. ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్ చేయడం, గత కొన్ని వారాల్లో గోల్డ్, సిల్వర్ భారీగా పెరగడంతో ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. రూపాయి కొంత బలపడడంతో భారత మార్కెట్లో దిగుమతి బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ ధ‌ర‌ల్లో ఇంకా ఒడిదుడుకులు కొనసాగవచ్చు. సిల్వర్‌లో వోలాటిలిటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ లో ఇవాళ బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.2,230 మేర భారీ పతనం నమోదైంది. పసిడి ధర ప్రస్తుతం రూ.1,56,060కు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,050 మేర తగ్గి రూ.1,43,050 పలుకుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,680 మేర తగ్గి రూ.1,17,040కు చేరుకుంది.

అదేవిధంగా బంగారంతో పోటీ పడుతూ గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు ఇవాళ కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. ఏకంగా ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధరపై రూ.15,000 పతనమైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.2,75,000గా కొనసాగుతోంది.

Leave a Reply