JAC 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
JAC 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో 46 ప్రతుల దగ్ధం
JAC 42 సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: బీసీల 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని సంగారెడ్డి బీసీ జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో 46 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించాల్సిందేనని చెప్పారు. రాజ్యాంగసవరణ చేసిన బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరారు.
JAC 42 బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు
తెలంగాణ ప్రభుత్వం వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రి, రాష్ట్రపతిని కలువాలని సూచించారు. బీసీలకు 42 శాతం చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోరారు. లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చించారు. వెంటనే 46 జీవోను రద్దు చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పి.ప్రభుగౌడ్, కోఆర్డినేటర్ వై.అశోక్ కుమార్, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్, కోకన్వీనర్ ఆర్.లక్ష్మి, మంగగౌడ్, నాగరాణి, కోటి వీరమణి, శృతిగౌడ్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాయిభాష, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, గోపాల్, శ్రీనివాస్, పద్మశాలి, విఠల్, విశ్వపతి, తదితరులు పాల్గొన్నారు.
