కారు ఢీకొని జంక మృతి…

కారు ఢీకొని జంక మృతి…
సంఘటన స్థలంలో పోస్టుమార్టమ్ నిర్వహించి ఖననం
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కొణకంచి క్రాస్ రోడ్ వద్ద కారు ఢీకొని జింక మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్‌రోడ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి వేదాద్రి వైపు వెళ్తున్న కారు పొలాల్లో నుంచి అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న జింకను ప్రమాద వశాత్తూ ఢీకొట్టింది. ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలై అ్కడక్కడికే మృతి చెందింది.
సంఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారు. ఫారెస్ట్ జగ్గయ్యపేట సెక్షన్ ఆఫీసర్ కె రవివర్మ, వీఆర్ ఓ పి శ్రీను, ఫారెస్ట్ బీటు ఆఫీసర్లు ఎం ప్రసన్నలీల, సీహెచ్ తేజస్వి, హైవే మొబైల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జింకను రోడ్డు పక్కకు చేర్చి స్థానికుల. సమక్షంలో నవాబుపేట పశువైద్యాధికారి శంకర్‌నాయక్ జింకకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం జేసీబీతో గుంత తీయించి ఖననం చేశారు.
