PARK |పార్కుల అభివృద్ధికి కృషి చేయాలి..

PARK |పార్కుల అభివృద్ధికి కృషి చేయాలి.. చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని పార్కులను అభివృద్ధి చేయాలని కోరుతూ మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత జమాల్ బాషా ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. సాంబశివ నగర్ పార్కు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సాంబశివ నగర్ పార్కులో స్విమ్మింగ్ పూల్ పేరుతో గుంతలు తవ్వారని, వాటిని వెంటనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్కులో వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని జమాల్ బాషా కోరారు.

గాంధీ పార్కుపై ఆరోపణలు..
పట్టణంలోని ముఖ్యమైన గాంధీ పార్కును గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ పార్కును కూడా తక్షణమే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే పుల్లారావుపై ఆశలు..
పట్టణంలోని అన్ని పార్కులను కూడా అభివృద్ధి చేయాలని మాజీ కౌన్సిల్ ప్రతిపక్ష నేత జమాల్ బాషా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే పుల్లారావుపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే పుల్లారావు పార్కులను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారని చెప్పారు. ఆయన అభివృద్ధికి చిరునామా కాబట్టి, పట్టణంలోని అన్ని పార్కులు అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ విధంగా చిలకలూరిపేట పట్టణ ప్రజల ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణం కోసం అన్ని పార్కులను వెంటనే అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply