చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి…

చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి…

మెదక్ జిల్లాలో ఘటన

కౌడిపల్లి, ఆంధ్రప్రభ : చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి చనిపోయిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన షేక్ గారి నరేందర్ గౌడ్ 45 కౌడిపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి వైన్స్ షాప్ లో సిట్టింగ్ రూమ్ వద్ద మిక్సర్ తదితర తినుబండారాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు.

శనివారం ఉదయం నర్సాపూర్ మెదక్ ప్రధాన రహదారికి కొద్ది దూరంలో గల బట్టమ్మ గుడి వెనకాల గల గుంపెన్ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply