వరి కొయ్యలను కాల్చొద్దు..
వరి కొయ్యలను కాల్చొద్దు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో వాగు పరివాహక ప్రాంతంలో గుర్తు తెలియని ఓ రైతు చేసిన పనికి వరి కోయలు కాలుకుంటూ ఊరు సమీపంలోకి వచ్చాయి. దీంతో ఆ గ్రామ సర్పంచి నాంపల్లి వీరేశంకు వెంటనే స్పందించి గ్రామంలోని ట్యాంకర్ సహాయంతో మంటలను ఆర్పడంతో ఊపిరి పిలుచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కోయలు కాల్చడం వల్ల ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరుగుతుంది. అందుచేత ఎవరు కూడా వరి కోయలను కాల్చరాదని తెలిపారు.
