Dog Squad | బాంబు స్కాడ్ అధికారుల తనిఖీలు..

Dog Squad | బాంబు స్కాడ్ అధికారుల తనిఖీలు..

Dog Squad | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఈ రోజు పలు దుకాణాలలో డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాంబు స్క్వాడ్ విత్ డాగ్ తో సహా తనిఖీలు చేపట్టామని గ్రామాలలో గంజాయి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు నిఘా పెట్టామని తెలిపారు.

ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినట్లయితే అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎవరైనా మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నారని తెలిసినా వెంటనే 100కు లేదా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారాన్ని అందించాలని ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, బాంబు స్క్వాడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply