Court | కోర్ట్ పనులు త్వరగా పూర్తి చేయండి…

Court | కోర్ట్ పనులు త్వరగా పూర్తి చేయండి…

Court | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ పట్టణానికి ప్రభుత్వం కోర్ట్ మంజూరు చేసిన నేపథ్యంలో కోర్ట్ ఏర్పాటు కొరకు కావలసిన భవనం మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిజామాబాదు జిల్లా కోర్ట్(Court) జడ్జి భారత లక్మీ సూచించారు. ఈ రోజు జిల్లా జడ్జిని భీంగల్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మాజీ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, లాయర్ సూర సురేష్ లు నిజామాబాదులో జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు.

కోర్ట్ ఏర్పాటు కొరకు గుర్తించిన భవనం మ‌రమ్మతులు తొందరగా పూర్తి చేస్తే కోర్ట్ ను భీంగల్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ కోర్ట్ ఏర్పాటు చేసే భవనం మరమ్మతుల కొరకు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

మంజూరు చేసిన నిధులతో మరమ్మతు పనులు వేగంగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు చేయిస్తున్నారన్నారు. భవనం త్వరితగతిన పూర్తి చేసి కోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తామని జడ్జికి నాయకులు తెలిపారు.

Leave a Reply