వ్యాయామ విద్యలో దారం నవీన్ కుమార్‌కు డాక్టరేట్
వ్యాయామ విద్యలో దారం నవీన్ కుమార్‌కు డాక్టరేట్
ఏప్రిల్ 30న వ్యాయామ విద్యలో పీహెచ్డీ పట్టా ప్రదానం చేసిన అన్నామలై వర్సిటీ
నవీన్ కు పలువురు అభినందనలు
విజయవాడ, ఆంధ్రప్రభ : అన్నామలై యూనివర్సిటీలో నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుడు, కోచ్ దారం నవీన్ కుమార్ పీహెచ్డీ పట్టా పొందారు. వ్యాయామ విద్య విభాగంలో పరిశోధన పూర్తి చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాను అందుకున్నారు. “ఎఫెక్ట్స్ ఆఫ్ స్పెసిఫిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ స్విస్ బాల్ ఎక్సర్సిసెస్ ఆన్ సెలెక్టెడ్ మోటార్ ఫిట్నెస్ అండ్ ఫిజిలోజికల్ వారిబుల్స్ అమోంగ్ కాలేజ్ మెన్ నెట్‌బాల్ ప్లేయర్స్” అనే అంశంపై నవీన్ కుమార్ చేసిన పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయం ఆమోదించింది. ఈ పరిశోధనకు సంబంధించి విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అకాడెమిక్ రీసెర్చ్ అధికారిక మెమో జారీ చేసింది.
ఈ మేరకు 2026 ఏప్రిల్ 30 నుంచి వ్యాయామ విద్యలో పీహెచ్డీ పట్టా ప్రదానం చేసినట్లు ప్రకటించారు. పరిశోధనకు అనుమతి లభించడంతో థీసిస్ ప్రచురణకు కూడా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ కు కుటుంబ సభ్యులు, మిత్రులు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకారం అందించిన గైడ్ డా.ఎస్.ఉమానాథ్, కో గైడ్ డా.పీ.పీ.ఎస్.పాల్ కుమార్, ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వీ.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ఫీజికల్ డైరెక్టర్ డా.ఎమ్.కోటేశ్వరరావు, డా.డి.యుగంధర్, మిత్రులకు, కుటుంబ సభ్యులకు నవీన్ కుమార్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
