యాదవ విద్యావంతుల వేదిక నూతన జిల్లా కమిటీ నియామకం

మహబూబ్ నగర్ రూరర్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహబూబ్నగర్ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా నూతన కమిటీని నియమిస్తూ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చలకాని వెంకట్ యాదవ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకానీ బాలు యాదవ్ గార్లు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అంజన్న యాదవ్,జిల్లా అధ్యక్షులుగా జుర్రు నారాయణ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోవా తిరుపతయ్య యాదవ్, జిల్లా కోశాధికారిగా వెంకటేష్ యాదవ, జిల్లా ఉపాధ్యక్షులుగా బత్తుల జగన్మోహన్ యాదవ్, మద్దిలేటి యాదవ్, జిల్లా అధికార ప్రతినిధిగా బావికాడి చెన్నయ్య యాదవ్, జిల్లా కార్యదర్శులుగా గుడిసె యాదయ్య యాదవ్, విష్ణువర్ధన్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సొంట సంతోష్ యాదవ్, ఈసీ మెంబర్లుగా నాగరాజు యాదవ్, శేఖర్ యాదవ్ గార్లకు నియామక పత్రాలను అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీకి నియమించబడ్డ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరుస్తూ బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జన సంఖ్య గల కమ్యూనిటీలో యాదవ సామాజిక వర్గం ఒకటాన్ని, కానీ సామాజికంగా, రాజకీయంగా,ఆర్థికంగా వెనకబడి ఉన్నందున విద్యావంతులుగా యాదవ సమాజాన్ని చైతన్యవంతం చేయుటలో తమ వంతు కృషి చేస్తామని, ముఖ్యంగా యాదవ సమాజాన్ని విద్యావంతులుగా చేయుటలో శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply