. పెద్దపల్లి ఆంధ్రప్రభ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినిలు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంగళవారం పెద్దపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఓమసియా, భోజన్నపేటకు చెందిన విద్యార్థిని అక్షయ స్కూటీపై ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినిలు గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.