అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకం…

అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకం…
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థానిక రేవతి సెంటర్ లో గల అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి ఈరోజు నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఆపద సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. తొలుత అగ్నిమాపక కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పలు పరికరాలు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

