పల్లికొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

పల్లికొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

  • అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పిండి. మనీషా అశోక్, దళిత యువజన సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ప్రతినిధులు, యువకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్, దళిత యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, బాబాసాహెబ్ ఆశయాలను గౌరవిస్తూ, ఆయన చూపిన అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.

సమాజ అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి దిశానిర్దేశం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ ఆయన చూపించిన మార్గం మనకు స్ఫూర్తి, ఆయన ఆలోచనలు మనకు మార్గదర్శకం. సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత.

ఈ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని మనం సంకల్పిద్దాం. ఈ కార్యక్రమంలో దళిత, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై భీమ్ నినాదాలతో ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత యువజన సంఘాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply