ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం

గన్నవరం, ఆంధ్రప్రభ ; గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఎబోలా వైరస్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

సింగపూర్ నుంచి విజయవాడకు చేరుకున్న 185 మంది ప్రయాణికులకు, రాష్ట్ర మెడికల్ బృందం ప్రత్యేకంగా ఎబోలా వైరస్ పరీక్షలు నిర్వహించింది.

ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ముందు జాగ్రత్త చర్యగా ఎబోలా స్క్రీనింగ్ చేస్తున్నామని, సింగపూర్ విమానంలో వచ్చిన 185 మందికి పరీక్షలు పూర్తి చేశామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Leave a Reply