ప్రతిఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలి.

ప్రతిఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలి.

టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రతిఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలని స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు. డివిజన్ ప్రాంతంలో ఏడవరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కండ్రిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రవికుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని పాదాచారులకు రవికుమార్ చల్లని మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తెలుగు యువత నాయకులు కాకోల్లు సాయి హర్ష , ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు,యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్,కంకణాల బాబు, మకాం సుందరరావు, కుప్పిలి రమణ, వంశి, నల్లిపొగు కన్నా,,లంకే నాగేశ్వరి పాల్గొన్నారు.