ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడతాం..

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడతాం..

సర్కిల్ వన్ కార్యాలయం లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

చిట్టినగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు వస్తుంది. అందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ వన్ కార్యాలయం లో శనివారం ఉదయం స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ ఆర్ మాధవి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు 2026 మే నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర థీమ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అని అన్నారు.

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ లను నిర్మూలించాలని, వ్యర్ధాలను సామర్ధ్యవంత గా నిర్వహణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను రీ సైకిలింగ్, రీ యూజ్ గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరారు. వాటి గురించి సిబ్బంది కి అవగాహన కల్పించారు. ఇంటి వద్ద నుండే పొడి చెత్త ను గ్రీన్ అంబాసిడర్ లో ద్వారా సేకరణ చేయాలి అని తెలిపారు. వెట్ వెస్ట్ ను ఉపయోగించి వర్మీ కంపోస్టు తయారీ గురించి వివరించారు. అనంతరం నేను సైతం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య కుమారి, శానిటరీ సూపర్వైజర్ డి సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆనంద్ కృపాల్, వివిధ సచివాలయం కార్యదర్శి లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు పాల్గొన్నారు.