Dharmmapuri l అందుబాటులో ఉండే సేవ చేస్తా…

Dharmmapuri l అందుబాటులో ఉండే సేవ చేస్తా…

Dharmmapuri l , ఆంధ్రప్రభ: ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు ప్రజలు ఒకసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఒక సేవకురాలిగా సేవ చేస్తానని 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వీరవేని నాగలక్ష్మి కొమురయ్యలు తెలిపారు. 9వ వార్డులో ఇంటింటా తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అత్యధిక నిధులు తీసుకువచ్చి కుల సంఘాల అభివృద్ధి వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. 9వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. కోరండ్లపల్లె తెనుగువాడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు దాదాపుగా వీరవేని నాగలక్ష్మి విజయం ఖాయమైందని ప్రజలు చర్చిస్తున్నారు

Leave a Reply