నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ యువజన నాయకుడు కొరివి తిరుపతి ముదిరాజ్ డిమాండ్ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
నీట్ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి, ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, విద్యార్థులకు న్యాయం జరిగేలా త్వరలోనే పకడ్బందీగా మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
