Dharmmapuri l అందుబాటులో ఉండి సేవ చేస్తా

Dharmmapuri l అందుబాటులో ఉండి సేవ చేస్తా

Dharmmapuri l ధర్మపురి, ఆంధ్ర ప్రభ: ధర్మపురి మున్సిపల్ 7వ వార్డు ప్రజలు భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ సేవా చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాంకుడోత్ విజయబాబు ఓటర్లను కోరారు. అదివారం వార్డు ప్రజలతో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏడో వార్డు ఎంతో అభివృద్ధి చెందిందని తనకు అవకాశం కల్పిస్తే ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఒక సేవకుడిగా పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డులు అభివృద్ధి చెందాలంటే విద్యావంతులు విజయం సాధించాలని విద్యాధికుడనైన తనను గెలిపించాలని ప్రజలను కోరారు. రాబోవు కాలంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.దాదాపు విజయ్ బాబు విజయం ఖాయం అయ్యింది

Leave a Reply