Dharmapuri | రామయ్య పల్లె అభివృద్ధికి కృషి చేస్తా
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : రామయ్య పల్లె సర్పంచ్ గా గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే… గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని రామయ్య పల్లె సర్పంచ్ అభ్యర్థి సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామంలో ఎస్సీ కాలనీలో పాఠశాలకు సీసీ రోడ్డు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పాన గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
