HYD | మరోసారి ఆస్పత్రికి కేసీఆర్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) మ‌రోసారి ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లారు. శుక్ర‌వారం ఆయ‌న హెల్త్ చెక‌ప్ (Health checkup) కోసం ఆస్ప‌త్రికి వెళ్లగా ప‌లు టెస్టులు నిర్వ‌హించారు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు శ‌నివారం కూడా మ‌రోసారి ఆస్ప‌త్రికి వెళ్లారు. ఆయ‌న వెంట మాజీ మంత్రి కేటీఆర్ (KTR), హ‌రీశ్‌రావు (Harish Rao) ఉన్నారు. ఇదిలా ఉంటే గ‌త కొంత‌కాలంగా కేసీఆర్ నీర‌సంగా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర‌వాత కాలికి గాయం అవ్వ‌గా కొద్దిరోజుల త‌ర‌వాత కోలుకున్న సంగ‌తి విదిత‌మే.

Leave a Reply